Thursday, January 1, 2009

నీతో

నవ్వాలి నీతో.. నడవాలి నీతో.. 
నెలవంక మీద నిలవాలి నీతో.. 
ఆడాలి నీతో.. అలగాలి నీతో.. 
హరివిల్లు మీద ఊగాలి నీతో.. 
తడవాలి నీతో.. ఆరాలి నీతో.. 
గడపాలి అనుక్షణం నేనే.. నీతో..

నవ్వాలి నీతో.. నడవాలి నీతో.. 
నెలవంక మీద నిలవాలి నీతో..

వస్తానని మాటిచ్చాకా.. కావాలని నే రాలేక..
నీలో చాలా ఆరాటాన్నే పెంచాలి..
వేరే కన్నెను నేనింక.. వంకర చూపులు చూసాక..
నీలో కలిగే ఆక్రోశాన్నే కాంచాలి..

నీ పైట గాలిని పీల్చాలి..
నీ మాట తేనెను తాగాలి..
నునులేత చీవాట్లు తింటా.. నీతో.. 

నవ్వాలి నీతో.. నడవాలి నీతో..
నెలవంక మీద నిలవాలి నీతో.. 
ఆడాలి నీతో.. అలగాలి నీతో..
హరివిల్లు మీద ఊగాలి నీతో.. 

చీటికి మాటికి ఊరించి.. చిలిపితనంతో ఉడికించి..
ముద్దుగ మూతిని ముడుచుకునుంటే.. చూడాలి.. 
ఓ ఓ.. అంతకు అంతా లాలించి.. ఆపై నీపై తల వాల్చి..
బ్రతిమాలేస్తూ జతగా నీతో బ్రతకాలి..

నీ వేలి కొనలను నిమరాలి..
నీ కాలి ధూళిని తుడవాలి..
అరచేతి గీతల్లే ఉంటా.. నీతో..

నవ్వాలి నీతో.. నడవాలి నీతో..
నెలవంక మీద నిలవాలి నీతో.. 
తడవాలి నీతో.. ఆరాలి నీతో..

గడపాలి అనుక్షణం నేనే.. నీతో..!!
 

No comments:

Post a Comment