ఆడించి అష్టాచెమ్మా ఆడించావమ్మా... నీ పంట పండిందే ప్రేమ...
నిజంగా నెగ్గడం అంటే... ఇష్టంగా ఓడడం అంతే..!
ఆ మాటే అంటే.. ఈ చిన్నారి నమ్మదేంటమ్మా...
నిజంగా నెగ్గడం అంటే... ఇష్టంగా ఓడడం అంతే..!
ఊరంతా ముంచేస్తూ.. హంగామా చేస్తావేంటే గంగమ్మా...
ఘోరంగా నిందిస్తూ.. ఈ పంతాలెందుకు చాల్లే మంగమ్మ...
చూసాక నిన్నూ... వేసాక కన్నూ.. వెనక్కెలాగా తీసుకోనూ...
ఏం చెప్పుకోనూ.. ఎటు తప్పుకోనూ.. నువ్వద్దన్నా నేనోప్పుకోనూ...
నువ్వేసే గవ్వలాటలో.. మెలేసే గళ్ళ బాటలో...
నీదాకా నను రప్పించింది నువ్వేలేమ్మా....
నిజంగా నెగ్గడం అంటే... ఇష్టంగా ఓడడం అంతే..!
ఓ...నా నేరం ఏముందే... ఏం చెప్పిందే నీ తలలో జేజెమ్మా...
మందారం అయ్యింది.. ఆ రోషం తాకి జళ్ళో జాజమ్మా...
పువ్వంటి రూపం... నాజూగ్గా గిల్లి కెవ్ అంది గుండె నిన్న దాకా...
ఉళ్ళట్టి కోపం... వళ్ళంతా అల్లి నవ్వింది నేడు ఆగలేక...
మన్నిస్తే తప్పేం లేదమ్మా... మరీ ఈ మారం మానమ్మా..
ఈ లావాదేవీలేమీ అన్నీ కొత్తేం కాదమ్మా...
No comments:
Post a Comment