ఈ నూతన సంవత్సరంలో క్రొత్త స్వరాలూ, ఆ స్వరాల జగత్తులో తేలుతూ, ఆనందం మీ మనసుని నింపాలని ,మీరు మీరుగా వెలగాలని, నలుగురిని వెలిగించాలని, అనురాగపు, అనుబందపు విలువలలో విలువలతో మిమలిని మీరు మైమరిచి పోవాలని ఈ సంవత్సరమంతా పరిమళించి, ప్రకాశించాలని ఆకాంక్షిస్తూ

అభినందనలతో మీ
ప్రియనేస్తం

Monday, January 12, 2009

నిరీక్షణ - ఆకాశం ఏనాటిదో

ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనొ
ఆనాడే తెలిసిందది
ఆవేశం ఏనాడు కలిగెనొ
ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది

చరణం 1
ఏ పువ్వు ఏ తేటిదన్నది
ఏ నాడో రాసున్నది
ఏ ముద్దు ఏ మోవిదన్నది
ఏ పొద్దో రాసున్నది
బంధాలై పెనవేయు వయసుకు
ఆందాలే దాసోహమనగ
మందారం విరబూయు పెదవులు
మధువులనే చవి చూడమనగ
పరువాలే ప్రణయాలై
స్వప్నాలే స్వర్గాలై
ఎన్నేన్నో శృంగార లీలలు
కన్నుల్లో రంగేళి అలరెను

చరణం 2
ఏ మేఘం ఏ వాన చినుకై
చిగురాకై మొలకెత్తునో
ఏ రాగం ఏ గుండె లోతున
ఏ గీతం పలికించునో
హృదయాలే తెర తీసి తనువుల
కలబోసి మరపించమనగ
కౌగిలిలో చెర వేసి మదనుని
కరిగించి గెలిపించ మనగ
మోహాలే దాహాలై
సరసాలే సరదాలై
కాలాన్నే నిలవేసి కలలకు
ఇవ్వాలి వెలలేని విలువలు

No comments:

Disclaimer:

This blog is dedicated to all the music directors and lyric writers of industry for adding music to our lives.The songs here are for promotional purpose only.

Making CD's from mp3 files is illegal.Buy original cd's and cassetes from the nearest store.We found all the links by mining the net.Blog owners hold no responsibility for any illegal usage of the content